నవతెలంగాణ – హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదలకు పలు ఘటనల్లో 16 మంది మరణించడం బాధాకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మానవ ప్రయత్నం ఎంత చేసినా ప్రకృతి విపత్తుతో భారీ నష్టం వాటిల్లినట్లు చెప్పారు. మంత్రి వర్గం, అధికారులు 48 గంటలుగా బాధిత ప్రాంతాల్లో పరిస్థితులను పర్యవేక్షించారన్నారు. అంటురోగాలు ప్రబలే అవకాశం ఉండటంతో అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.