30న జరిగే కాంగ్రెస్ సభను విజయవంతం చేయాలి: షబ్బీర్ అలీ

నవతెలంగాణ –  జమ్మికుంట
ఈ నెల 30 మంగళవారం  మధ్యాహ్నం 2 గంటలకు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మికుంట లో  నియోజకవర్గ ఇంచార్జి వొడితెల ప్రణయ్ బాబు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని డీసీసీ కార్యదర్శి షేక్ షాబీర్ అలీ శనివారం ఒక ప్రకటనలో కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణ, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విపు అది శ్రీనివాస్ , చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొననున్నారని ఆయన తెలిపారు. కాబట్టి కాంగ్రెస్ అభిమానులు నాయకులు కార్యకర్తలు మహిళలు  ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.