నేడు కల్వకుర్తికి సీఎం రేవంత్‌రెడ్డి

– జైపాల్‌రెడ్డి కాంస్య విగ్రహావిష్కరణ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
మాజీ కేంద్ర మంత్రి, ‘ఉత్తమ పార్లమెంటేరియన్‌’ అవార్డు గ్రహీత సూదిని జైపాల్‌రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆదివారం కల్వకుర్తి సమీపంలోని కొట్ర జంక్షన్‌ వద్ద సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, మహబూబ్‌నగర్‌ ఇన్‌చార్జి మంత్రి సి. దామోదర రాజనర్సింహ, ఎక్సైజ్‌, సాంస్కృతి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.చిన్నారెడ్డి, ఎంపీ డాక్టర్‌ మల్లు రవితోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు హాజరవుతారు. అంతకు ముందు సాయంత్రం 4 గంటలకు కల్వకుర్తి నూతన మున్సిపల్‌ కార్యాలయం సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ గ్రౌండ్స్‌లో జరగనున్న బహిరంగ సభలో రేవంత్‌ ప్రసంగిస్తారు.