ఎన్నికల హామీలు నెరవేర్చని సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడు, చింతాగూడ పిఎసిఎస్ వైస్ చైర్మన్ విజయ ధర్మ డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన పత్రిక విలేకరులతో మాట్లాడుతూ.. ఆగస్టు 15లోపు రైతులకు రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించినా నేటి వరకు ఏ ఒక్క రైతు ఖాతాలో రుణమాఫీ డబ్బులు పడలేదన్నారు. మాట నిలబెట్టుకొని సీఎం వెంటనే తన సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. తను మాట్లాడే తప్పడమే కాకుండా మాజీ మంత్రి హరీష్ రావును రాజీనామా చేయమనడం అతని అవివేకం అన్నారు. ఈరోజు వరకు రెండు లక్షల రుణమాఫీ కాలేదు అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. ఆరు గ్యారెంటీ స్కీములను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేకుంటే టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సులువ జనార్ధన్, జిల్లా నాయకులు బాలసాని శ్రీనివాసగౌడ్, సృజన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.