నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీపై క్యాబినెట్ అమోదించడాన్ని హర్షిస్తు భువనగిరి మండలం లోని అనంతారం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు గ్రామ శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కొండల్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ విఠల్ వెంకటేశ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎర్ర శ్రీరాములు, గ్రామ శాఖ అధ్యక్షులు ఎర్ర మహేష్, సల్ల పాండు, రైతులు అంజమ్మ, ఇందిరమ్మ, ఐలయ్య, కళ్లెం.సత్యనారాయణ రెడ్డి,రాజిరెడ్డి, సత్తయ్య, రాజయ్య, మల్లారెడ్డి, కాంగ్రెస్ నాయకులు జంగయ్య, మల్లేష్,రాంబాబు,నవీన్,రాజలింగం,వంశి, బండిరాల శివలు పాల్గోన్నారు.