సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటం దగ్ధం 

Efficacy of CM Revanth Reddy burnt..నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
శాసనసభలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పై అధికార పక్షం వ్యవహరించిన తీరుకు నిరసిస్తూ గురువారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో టఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్త చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మహిళ మాజీ మంత్రి అని చూడకుండా మాట్లాడడం సరైనది కాదన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, మాజీ ఎంపీపీ లకావత్ మానస, బిఆర్ఎస్ పట్టాణ అధ్యక్షుడు ఎండి అన్వర్, కౌన్సిలర్ లు  బోజు రమాదేవి రవీందర్ , పేరుక భాగ్యరెడ్డి, వాల్ల సుప్రజ నవీన్, అక్కన్నపేట మండల అధ్యక్షుడు పెసరు సాంబరాజు బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.