నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో సోమవారం నాడు బీజేపీ ఓబీసీ మోర్చా అధ్వర్యంలో తహసీల్ధార్ కార్యాలయంలో ఎదుట ధర్నా ఆందోళన చేపట్టారు. తహసీల్ధార్ ఎండి ముజీబ్ కు ఒక వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు 2023 ఎలక్షన్‌లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, ఓబీసీ మోర్చా జుక్కల్ అసెంబ్లీ కన్వీనర్ సంతోష్ తులవర్ ఓబీసీ మండల అధ్యక్షులు దిలీప్ పటేల్ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్ధార్ కు వినతి పత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు తెప్పవార్ తుకారాం, మండల యూత్ నాయకులు సుధాకర్ పటేల్, కంచిన్వార్ యాద్రవ్, సక్కర్ల వార్ బాలకిషన్, వెంకట్ కాలే, అంజన్న, ప్రవీణ్ దేశాయ్, సుభాష్, మాధవ్ పటేల్, బీజేపీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.