రేపు మండల రైతులతో సీఎం రేవంత్ వీడియోకాన్ఫరెన్స్

CM Revanth videoconference with mandal farmers tomorrowనవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం జై కేసారం క్లస్టర్ పరిధిలో కుంట్లగూడెం రైతు వేదికలో రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి రూ.2 లక్షల రుణమాఫీ లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడతారని చౌటుప్పల్ మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రైతులు ప్రజాప్రతినిధులు అధికారులు లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏవో నాగరాజు కోరారు.