మహిళలకు ఇచ్చిన హామీలను సీఎం నెరవేర్చాలి

నవతెలంగాణ – సిద్దిపేట
సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ నాయకురాలు  కొంపల్లి పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జక్కాపూర్ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన అబద్ధపు ప్రచారము, అబద్ధపు హామీలపై ఆమె మాట్లాడుతూ  మహిళలకు  ప్రతి నెల ఒకటో తారీఖున రూ.2500, విద్యార్థులకి స్కూటీలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. రైతులకు రూ.500 బోనస్ ఇవ్వాలని, ఎండిపోయిన పంటలకి రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలని , రెండు లక్షల రుణమాఫీ చేయాలని  డిమాండ్ చేశారు.