
నవతెలంగాణ – కంటేశ్వర్
బాసర్ త్రిబుల్ ఐటీ లో విద్యార్థి మరణం పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించాలని అఖిలభారత ప్రగతిశీల విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఏఐపీఎస్ యు జిల్లా నిజామాబాద్ బాధ్యులు బోడ అనిల్ మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాలోని బాసర త్రిబుల్ ఐటీ లో అరవింద్ అనే విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి నేరుగా పర్యటించాలని అన్నారు. గతంలో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పుడు నేరుగా పర్యటించిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని అన్నారు. ఈ మరణాలపై స్పందించి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే విధంగా చూడాలని అన్నారు. గత ప్రభుత్వం విద్యారంగం పైన ఏ విధమైన తీరు ఉందో అదేవిధంగా విద్యారంగం గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అసెంబ్లీ సమావేశాలలో ఇతర అంశాల పైన స్పందించి విద్యా రంగంపై మౌనంగా ఉన్నారు. నూతన ప్రభుత్వ హయాంలో కూడా అదే తీరు కనిపిస్తుంది అనేక సమస్యలు ఉన్న ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బాసర త్రిబుల్ ఐటీ లో ఉన్నటువంటి సమస్యల్ని ప్రక్షాళన చేయాలని లేనిపక్షంలో అన్ని విద్యార్థి సంఘాలుగా బాసర త్రిబుల్ ఐటీ ని ముట్టడించాల్సి ఉంటుందని అన్నారు.