నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
మూసి పునర్జీవన సంకల్ప యాత్ర పాదయాత్రలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకొని, సంగేములో పాదయాత్ర పర్యటన సందర్భంగా భువనగిరి మండలంలోని బొల్లెపల్లి గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ఆగుతారని భావించి, ఆ గ్రామంలో కార్యకర్తలు కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా కామ్రేడ్ రావి నారాయణరెడ్డి ఫోటో తో వేదిక ఏర్పాటు చేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి బొల్లెపల్లి గ్రామంలో ఆకపోవడంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఆగకుండా వెళ్లడంతో కనీసం ఆ గ్రామంలో కొద్దిసేపు ఆగి , బస్సు దిగి అభివాదం చేస్తే బాగుండేదని కాంగ్రెస్ కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. సీఎం వెళ్ళిన వెంటనే కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించి, కామ్రేడ్ రవి నారాయణ రెడ్డికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీటీసీ గడ్డమీది పారిజాత వీరస్వామి గౌడ్, భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కనుకుంట్ల రేఖ బాబురావు, రావి నారాయణరెడ్డి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.