
మండలంలోని నారాయణపేట గ్రామానికి చెందిన 8 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేసినట్లు గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేందర్ తెలిపారు. ప్రభుత్వం ద్వారా మంజూరైన ముఖ్యమంత్రి సహాయ చెక్కులను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ రవ్వ వెంకట్, మాజీ వార్డ్ సభ్యుడు అనిల్ లబ్ధిదారులు పాల్గొన్నారు.