పాఠశాలను సందర్శించిన సీఎంవో అధికారులు..

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని నాగపూర్ ప్రాథమికోన్నత పాఠశాలను గురువారం సీఎంవో అధికారి శ్రీనివాసరావు, ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రీధర్ రెడ్డి సందర్శించారు. పాఠశాలలో పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, ప్రమోషనల్ యాక్టివిటీ స్టేటస్, అమ్మ ఆదర్శ పాఠశాల పనులను వారు పరిశీలించారు.అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో భాగంగా విద్యార్థుల సౌకర్యార్థం చేపట్టిన మరుగుదొడ్లు, మూత్రశాల నిర్మాణాలను వారు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాసం శ్రీనివాస్ గౌడ్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ సురేందర్, ఉపాధ్యాయులు స్వరూప రాణి, స్వప్న, తదితరులు పాల్గొన్నారు.