సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత..

నవతెలంగాణ- దుబ్బాక : మండల పరిధిలోని అప్పనపల్లి గ్రామానికి చెందిన వతం రాజు కు మంజూరైన రూ.19 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును కాంగ్రెస్ దుబ్బాక మండలాధ్యక్షులు కొంగర రవి మంగళవారం అందజేశారు.ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేద,మధ్యతరగతి కుటుంబాలకు కొండంత అండ లభిస్తుందన్నారు. వారి వెంట కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు అనంతుల శ్రీనివాస్,మండల ఉపాధ్యక్షులు కడ్దూరి నరేందర్ రెడ్డి,జనరల్ సెక్రటరీ చర్లపల్లి బాల్ రెడ్డి,మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ శ్రీరామ్ నరేందర్,ఐరేని సాయితేజ గౌడ్,పలువురు కార్యకర్తలున్నారు.