నవతెలంగాణ – దుబ్బాక రూరల్
సీఎంఆర్ఎఫ్ చెక్కులు నిరుపేద కుటుంబాలకు వరం లాంటిదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మండల పరిధిలోని పెద్ద గుండవెల్లి గ్రామానికి చెందిన దండు లక్ష్మి సద్ది పుష్ప,నక్కల మల్లయ్య,శివరాత్రి శాలవ్వ, మల్లయ్యలకు రూ. లక్ష 33 వేల 500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పెద్ద గుండవెల్లి బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మల్లుగారి ప్రేమ్ , నక్కల రాఘవరెడ్డి, గంట అజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.