నవతెలంగాణ – భువనగిరి
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం లాంటిదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం పెద్ద అంబర్పేట్ లోని క్యాంప్ కార్యాలయంలో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 17 మంది లబ్ధిదారులకురూ.7 లక్షల 17 వేల 5వందల చెక్కులను భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం లాంటిదని, ఆపదలో మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ ఆసుపత్రిలో చేరిన పేదల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.