నేడు ఇబ్రహీంపట్నానికి సీఎం రాక

– సభాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు
– పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు
నవతెలంగాణ రంగారెడ్డి ప్రతినిధి
ఎన్నికల ప్రచారాన్ని అధికార పార్టీ విస్తృ తం చేసింది. క్షేత్రస్థాయిలో ప్రజలను మననం చేసుకునేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. అందులో భాగంగానే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ను మరోసారి ఇబ్రహీంపట్నం రానున్నారు. ఈ నెల 14వ తేదీన ఇబ్రహీంపట్నంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారు. ఈ సభలో మంచి రెడ్డి కిషన్‌ రెడ్డి తరఫున దిశానిర్ధేశ్యాన్ని చేయనున్నారు. మరోసారి గెలి పిస్తే చేయబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర మాలను వివరించనున్నారు. అందు కోసం బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఏర్పాటును నిమగ మయ్యాయి. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాల యం సమీపంలో ఏర్పాటు చేయడంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చకచక సాగు తున్నాయి. మరోవైపు అధికార బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నామినేషన్‌ సందర్భంగా జరిగిన ఘర్షణ నేపథ్యం లో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. 24 గంటల ముందే ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇబ్రహీంపట్నం కేంద్రంలో ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసు కవాతు నిర్వహించారు. ముఖ్యమంత్రి వాయు మార్గంలో వస్తున్నందున హెలిఫ్యాడ్‌ సైతం సిద్ధం చేశారు. 2015 నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇబ్రహీంపట్నంలో అడుగుపెట్టడం మూడోసారి. 2015 లో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పార్టీ మారుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. 2018 ఎన్నికల్లో ఇదే వేదిక నుంచి మంచిరెడ్డిని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మరోసారి 2023 ఎన్ని కల నేపథ్యంలో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తరఫున ప్రచారానికి సైతం రానున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ ఏర్పుల చంద్రయ్య, మంచాల ఎంపీపీ నర్మద తదితరులున్నారు.