– భారీ కేక్ కట్ చేసి సంబురాలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పుట్టినదినం సందర్భంగా శుక్రవారం గాంధీభవన్‌లో పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించారు. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మెన్ మెట్టుసాయికుమార్, పార్టీ నేత గజ్జలకాంతం ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు పెంచినందుకు విద్యార్థులు రేవంత్ మాస్క్ పెట్టుకుని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షులు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి, టీజీటీఎస్ చైర్మెన్ మన్నె సతీష్, సీనియర్ నేత కుమార్‌రావు, యువజన కాంగ్రెస్ మాజీ జాతీయ కార్యదర్శి ఊట్ల వరప్రసాద్ తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 40 అడుగుల కటౌట్‌కు గ్రేటర్ హైదరా బాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోత రోహిత్ పాలాభిషేకం చేశారు.