ఆదిలాబాద్ లో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు

CM's birthday celebrations in Adilabadనవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ప్రజా పాలనతో ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న రేవంత్ రెడ్డి వచ్చే పదేండ్ల వరకు సీఎంగా కొనసాగుతారని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ముఖ్యమంత్రి పుట్టిన రోజు వేడుకలను ప్రజా సేవ భవన్ లో ఘనంగా నిర్వహించారు. ముందుగా నాయకులతో కలిసి కేక్ కట్ చేసి తినిపించి సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా కంది శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. పలువురు స్వచ్చందంగా పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం ప్రభుత్వ పథకాలు పొందిన లబ్దిదారులు, ఉద్యోగులు, రైతులు, మహిళాలను సత్కరించారు. ఈ సందర్భంగా నియోజవకర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ… పేదల సంక్షేమమం కోసం సీఎం రేవంత్ రెడ్డి అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. గత సంవత్సరం నవంబర్ 8న ఆదిలాబాద్ జిల్లాలో బహిరంగ సభ నిర్వహించి ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారని, ఆదిలాబాద్ పై సీఎంకు ప్రత్యేక అభిమానం ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఉచిత కరెంట్ బిల్లు, ఐదు వందల రూపాయలకే గ్యాస్, రైతు రుణమాఫీ ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏ విధంగానైతే ప్రజల ఆధారణ పొందారో.. అదే విధంగా రేవంత్ రెడ్డి ఆధారణ పొందారన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలన మరో పదేండ్లు కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గిమ్మ‌సంతోష్ రావు, లోక ప్ర‌వీణ్ రెడ్డి, కౌన్సిల‌ర్ సంద న‌ర్సింగ్, ల‌క్ష్మ‌న్ ,డేరా కృష్ణారెడ్డి, ఎంఏ ష‌కీల్ పాల్గొన్నారు.