తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సురుపంగ చందు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా విద్యార్థులతో కలిసి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరమని, అందరి సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని, యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ నాయకులు ఉగ్గి ప్రసాద్, తోటకూరి పరమేష్ లు పాల్గొన్నారు.