నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలుగు రాష్ట్రాలు సీఎంలు చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. తీవ్రవాద నిరోధంపై అన్ని రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం శాఖ నిర్వహించే సమావేశానికి వీరివురు హాజరు కానున్నారు. మరోవైపు వరద పరిహారం విషయమై సీఎం రేవంత్‌ కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటనలోనే కాంగ్రెస్‌ అగ్రనేతలను సీఎం రేవంత్‌ కలవొచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి.