ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పడాల రవీందర్ అన్నారు. శనివారం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియ సమావేశంలో మాట్లాడారు. 2023 ఎన్నికల సమయంలో సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ సభలో హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారన్నారు. పది నెలలు అవుతున్న ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదన్నారు. దాని కారణంగా తమ ఉద్యోగాన్ని రాజీనామ చేసి సమగ్ర ఉద్యోగుల తరపున ఎమ్మెల్సీ ఎన్నికల బరీలో నిలబడ్డామన్నారు.
ఓటు నమోదుపై నిర్లక్ష్యం వీడనాడలి
ఉమ్మడి జిల్లాలో లక్షల మంది గ్రాడ్యుయేట్ లు ఉన్నప్పటికీ నేటికీ కనీసం 15 వేల ఓట్లు కూడా నమోదు కాకపోవడం చాలా బాధాకరమని అన్నారు. జిల్లాలో వేలాది సంఖ్యలో ఉపాధ్యాయులు, డాక్టర్లు ఇంజనీర్లు మెడికల్ సిబ్బంది అన్ని విభాగాల్లో ప్రభుత్వ విభాగాలు ప్రైవేట్ విభాగాలు అత్యున్నత ప్రమాణాలతో చదువుకొని ఉన్నప్పటికీ తమ ఓటు నమోదులో నిర్లక్ష్యాన్ని విడనాడాలని కోరారు. ఓటు రాజ్యాంగం ఇచ్చిన హక్కు దాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. మీ ఫోన్ ద్వారా ఆన్లైన్లో గాని లేదా ఆయా కేంద్రాల్లోకి వెళ్లి ఈనెల 6వ తేది వరకు ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.