సీఎం ఇచ్చిన హామీలను అమలు చేయాలి..

CM's promises should be implemented.– సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని & మినిమం టైం స్కేల్ అమలు చేయాలని,  సీఎం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ  జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన దీక్ష & మహా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో సమగ్ర శిక్షా ఉద్యోగులు సమ్మె చేస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 13,  2023 న టిపిసిసి  అధ్యక్షులు హోదాలో హన్మకొండ లో పాల్గొని సమగ్ర శిక్షా ఉద్యోగులను కాంగ్రేస్ ప్రభుత్వం వచ్చిన నెల (30) రోజులలో రెగ్యులర్ చేస్తామని, బేసిక్ పే (మినిమం టైం స్కేల్)  అమలు చేస్తామని మీ సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారనీ గుర్తు చేశారు.  నవంబర్ -18 న 2023లో మీడియా ముఖంగా, ట్విట్టర్ ముఖం గా సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులర్ చేస్తాము అని హామీ ఇచ్చినారనీ, సీఎం,  &ప్రభుత్వం మంత్రులు అందరిని గత 9 నెలల్లో అనేక సార్లు కలిసి న్యాయం చెయ్యాలని వినతి పత్రాలు ఇచ్చినప్పటికి న్యాయం జరగలేదన్నారు.  ఇప్పటికే 169 మంది ఉద్యోగులు వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోయారనీ, ఐనా ప్రభుత్వం చిల్లి గవ్వ ఇవ్వకుండా మరణంలొ కూడా న్యాయం జరగలేదనీ ఆరోపించారు. 61 సంవత్సరాలు నిండిన వారిని నిర్దాక్ష్యాన్యంగా 100 పైన  ఉద్యోగులను రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా తొలగించాలని అన్నారు.  దశల వారీగా పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి సమగ్ర శిక్షా ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేసే వరకు పోరాటం చేస్తాము అని సమస్యల పరిష్కారం కొరకు సమ్మెకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. డిమాండ్స్ … సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. తక్షణమే బేసిక్ పే (మినిమం టైం స్కేల్)అమలు చేయాలి. ఆరోగ్య బీమా కొరకు 10లక్షలు, జీవిత బీమా కొరకు 10 లక్షలు, రిటైర్మెంట్ బెన్ఫిట్స్ 10 లక్షల సౌకర్యం కల్పించాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.