దొడ్డికొమురయ్యకు సీఎం నివాళి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన దొడ్డి కొమురయ్యకు సీఎం రేవంత్‌ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు డీప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తదితరులు ఆ యోధుని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.