నవతెలంగాణ-మెహిదీపట్నం
మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహాత్మునికి నివాళులు అర్పించారు. మంగళవారం హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాపు ఘాట్‌కు చేరుకున్న సీఎం.. మహాత్ముని స్మారక చిహ్నానికి పూలతో శ్రద్ధాంజలి ఘటించారు. బాపూఘాట్ ఆవరణలో గల గాంధీజీ విగ్రహానికి పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనల్లో సీఎం పాల్గొన్నారు. సీఎం వెంట రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, ఇతర అధికారులు ఉన్నారు.