యూపీఎస్సీ సిఎస్ఎటి 2023 పరీక్షలలో అర్హత పొందిన అభ్యర్థులకు కోచింగ్ ఏర్పాటు

నవతెలంగాణ- కంటేశ్వర్
టి ఎస్ ఎస్ సి స్టడీ సర్కిల్,హైదరాబాద్, 28-05-2023న నిర్వహించిన యుపిఎస్సి సిఎస్ఏటి -2023 పరీక్షలో అర్హత పోoదిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీతో సహా) అభ్యర్థులకు సివిల్ సర్వీసుల మెయిన్స్ కు కోచింగ్ ను ఏర్పాటు చేస్తున్నది.తల్లిదండ్రుల వార్షిక ఆదాయం సంవత్సరానికి రూ.3.00లక్షల కంటే తక్కువగల అభ్యర్ధులు 30-06-2023న లేదా ఆలోగా దిగువ డాక్యుమెంట్లతో పాటు డైరెక్టర్, టి ఎస్ ఎస్ సి స్టడీ సర్కిల్, బంజారాహిల్స్, హైదరాబాద్ ను స్వయంగా సంప్రదించవలసిందిగా ఆదేశించినట్లు శనివారం ప్రకటనలో టీఎస్ ఎస్సీ స్టడీ సర్కిల్ స్టేట్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు అని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి బి.శశికళ తెలిపారు. యూపీఎస్సీ సిఎస్ఎటి హల్ టికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఎమ్మార్వో జారీ చేసిన ఇటీవలి ఆదయ సర్టిఫికెట్ (జూన్ 2022 మరియు మే 2023 మధ్య), మీరు ఆఖరిగా చదివిన విద్యాఅర్హత యొక్క ప్రోవిజినల్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాఫీ,రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు.అడ్మిషన్ మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికన ఇవ్వబడుతుంది మరియు కేటగిరీ వారీగా లభించే సీట్లు ఎస్సీ-27, ఎస్టి -2, బీసీ-2, ఒక నిర్ణీత కేటగిరీలో తగినంత మంది అభ్యర్ధులు అడ్మిట్ కాకపోతే ఆ సీట్లు ఇతర కేటగిరీలతో కూడా భర్తీ చేయబడతాయి అని టీఎస్ ఎస్సీ స్టడీ సర్కిల్ స్టేట్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. అని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి బి.శశికళ తెలిపారు.