– రంగారెడ్డి జిల్లా సీఐటీయూ అధ్యక్షులు రాజు, కార్యదర్శి చం ద్రమోహన్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
సింగరేణి బొగ్గుగనుల వేలంపాట ఆపిగనులను వెంటనే సింగరేణికే కేటాయించాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజు, కార్యదర్శి చం ద్రమోహన్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి వేలాన్ని వేయ డాన్ని వ్యతిరేకిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కాటేదాన్‌లో రాస్తారోకో నిరసనా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ దేశానికి మణిహారంగా ఉన్న సింగరేణి సంస్థను దివాళా తీయించే విధంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలం పాట ప్రారంభించిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి కేంద్ర బొగ్గుగనులశాఖ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి, హైదరాబాద్‌లోనే ఈ ప్రక్రియ ప్రారంభించటం ఆందోళనకరం. ఈ ప్రారంభకార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్య మంత్రిభట్టి విక్రమార్క పాల్గొనటం ఆశ్చర్యకరమని వారు స్పష్టంచేశారు. ఒకవైపు బొగ్గు బ్లాకును వేలం వేస్తూ, మరొకవైపు సింగరేణిని ప్రయివేటీకరించ బోమని మంత్రి కిషన్‌రెడ్డి బుకాయిస్తున్నారు. ఇది ఓట్లు వేసి గెలిపించిన తెలం గాణ ప్రజలను మోసం చేయటమే. తక్షణం వేలంపాట రద్దు చేయాలనీ, రా ష్ట్రంలో బొగ్గుతవ్వే సంస్థగా సింగరేణికే బొగ్గుబ్లాకులు అప్ప గించాలనీ సీఐటీ యూ జిల్లా కమిటీ మోడీప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి జి.కవిత, జిల్లా ఉపాధ్యక్షులు జాజాల రుద్రకు మార్, సాయిబాబా, జిల్లా సహాయ కార్యదర్శిలు ఎస్.రామ్మో హన్‌రావు, అలీ దేవేంద, స్వప్న, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు, జి.కురుమయ్య, ఎస్. వీర య్య, జె.పెంటయ్య, బుట్టి బాలరాజు, నరసింహ బుగ్గరాములు ఎల్లేష్, వెంక టేష్‌గౌడ్, బాలరాజ్, జాంగిర్, సచిన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.