బొగ్గు లారీలు అడ్డగింత

– పంటలపై దుమ్ము, దూళి చేరి పెట్టుబడిపై ప్రభావం చూపుతోందని రైతుల ఆందోళన
నవతెలంగాణ – మల్హర్ రావు
రోడ్డుకు ఇరువైపులా ఉన్న పత్తి,మిర్చి,పొలాలు తదితర పంట చెల్లపై బొగ్గు లారీల దుమ్ము చేరి పంటలు పనికి రాకుండా పోతున్నాయని ఆదివారం తాడిచెర్ల-మల్లారం ప్రధాన రహదారిపై రైతులు తూండ్ల రాజయ్య, రామయ్య,రాజు,మల్లయ్య తదితరులు బొగ్గు లారీలను అడ్డుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు నిత్యం లారీలతో వెలువడే దుమ్ము,దూళితో పత్తి,మిర్చి,వరి పంటలపై చేరడంతో తమకు దిగుబడిపై ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.దుమ్ము,దూళి లెవకుండా ఉదయం,మధ్యాహ్నం, సాయంత్రం రోజుకు మూడుసార్లు ట్యాoకర్ ద్వారా నీళ్లు చల్లాలని కంపెనీ నిర్వాహకులను డిమాండ్ చేశారు. లేదంటే ప్రతిరోజు బొగ్గు లారీలను అడ్డుకుంటామని హెచ్చరించారు.