– ఎట్టకేలకు ఫార్మర్ షెడ్ నిర్మించనున్న ఆయిల్ఫెడ్..
– శంకుస్థాపన చేసిన డి.ఒ బాల క్రిష్ణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆయిల్ ఫాం సాగుదారుల,గెలలు రవాణా దారుల వెతలు తీర నున్నవి.ఎన్నో ఏళ్ళ రైతులు, రైతు సంఘాల నాయకులు విన్నపాలు కు ఆయిల్ఫెడ్ సంస్థ మోక్షం కలిగించింది.ఎఫ్.పి.ఒ, రైతు సంఘం నాయకులు కె.పుల్లయ్య, ఇతర సంఘాలు నాయకులు ఆలపాటి రాంచంద్ర ప్రసాద్, కోటగిరి సీతారామ స్వామి లు పరిశ్రమ ప్రాంగణం లో క్యాంటీన్ నిర్మించి గెలలు రవాణా దారులకు,రైతులకు కనీసం విశ్రాంతి,మంచినీటి సౌకర్యం కల్పించాలని ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామక్రిష్ణా రెడ్డి, ఎం.డి సురేందర్ రెడ్డికి పలుమార్లు విన్నపాలు చేసారు. స్పందించిన సంస్థ రూ.8 లక్షల వ్యయంతో ఫార్మర్ షెడ్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. దీంతో బుధవారం డి.ఒ బాలక్రిష్ణ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో అదనపు మేనేజర్ నాగబాబు, సాంకేతిక విభాగం అధికారులు వెంకటేష్, పవన్, రైతు సంఘాల నాయకులు పుల్లయ్య, సీతారామస్వామి, సీమకుర్తి వెంకటేశ్వరరావు, జేకేవీ రమణారావు, కాసాని చంద్రమోహన్ లు పాల్గొన్నారు.