ప్రభుత్వ భూముల అక్రమాలకు పాల్పడుతున్న…

– రెవిన్యూ, పంచాయితీ అధికారులు
– యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్
నవతెలంగాణ మల్హర్ రావు/కాటారం
కాటారం మండల కేంద్రముతోపాటు రేగుల గూడెం,పోతుల వాయి గ్రామాల్లో  ప్రభుత్వ భూములను అక్రమంగా   వ్యాపార వేత్తలకు ,ఉద్యోగులకు అక్రమ పద్ధతులలో లంచాలు తీసుకొని మండల రెవెన్యూ ,గ్రామ పంచాయితీ కార్యదర్సులు ఇండ్లు, వ్యాపార దుకాణాల సముదాయాలు కట్టుకోవడానికి అనుమతులు ఇస్తున్నారని (యువైఏప్ఐ) అఖిల భారత ఐఖ్య యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్  ఆరోపించారు. మంగళవారం కాటారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు అక్రమంగా ఇండ్లు, దుకాణాలు నిర్మాణం చేస్తున్న వ్యాపారుల వద్ద రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఆమ్యామ్యాలు తీసుకొని ప్రభుత్వ భూముల్లో ఇండ్ల అనుమతులు ఇస్తున్నారే తప్పా పేదలకు ఇవ్వడం లేదన్నారు.ఉన్నతాధికారులు ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నారు.అవినీతికి పాలడుతున్న రెవిన్యూ,పంచాయితీ కార్యదర్శుల పై జిల్లా కలెక్టర్ తగు విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అట్లాగే అక్రమంగా ప్రభుత్వ భూములను కాజేసిన వ్యాపారులు, ఉద్యోగుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో యువైఏప్ఐ ఆధ్వర్యంలో పేదల తరుపున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంటా యువైఏప్ఐ రాష్ట్ర కమిటీ. దయ్యం పోచయ్య ఉన్నారు.