కోడ్‌ ఎఫెక్ట్‌

– అన్ని ప్రభుత్వ వెబ్‌సైట్ల నుంచి మోడీ ఫొటో ఔట్‌
– రాష్ట్రాల్లో సీఎంల ఫొటోలు కూడా..
న్యూఢిల్లీ : లోక్‌సభ, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు భారత ఎన్నికల సంగం (ఈసీఐ) నోటిఫికేషన్‌ను విడుదల చేయటంతో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ (ఎంసీసీ) దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. ఈ కోడ్‌ ప్రభావంతో అన్ని మేజర్‌ ప్రభుత్వ వెబ్‌సైట్ల నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగిపోయింది. ఎన్నికల కోడ్‌కు ముందు అన్ని ప్రభుత్వ వెబ్‌సైట్లలో మోడీ ఫొటోది. అయితే, ప్రధాని వ్యక్తిగత సైట్‌, పీఎం కిసాన్‌, ఆర్టీ వంటి పోర్టల్స్‌లో సైతం ప్రధాని స్థాయిలో మోడీ ఫొటో కనిపించటం లేదు. అలాగే, పీఎం ఆన్‌ రేడియో, మైగవ్‌ వెబ్‌సైట్ల సహా అన్ని ప్రభుత్వ వెబ్‌సైట్‌ల నుంచి ‘మన్‌ కీ బాత్‌’ రేడియో షో అన్ని ఎపిసోడ్‌ల డిజిటల్‌ రికార్డింగ్‌లు తొలగించబడ్డాయి. అలాగే, ఆయా రాష్ట్రాల ప్రభుత్వ వెబ్‌సైట్లలోనూ ఇదే తీరు కనిపించింది. ఆయా రాష్ట్రాల సీఎంల ఫొటోలు వాటి నుంచి తొలగించబడ్డాయి.