కాఫీని ఆస్వాదిస్తున్నప్పుడు – ఎవరి చేయో తగిలి ఒలికిపోతే చేయి కాలిందనో, నేల మీద, బట్టలమీద మరకలు పడ్డాయనో అరిచేస్తారు కొంతమంది. ఆ సమయంలో చర్రున కోపం వస్తుంది. ఇంకొంతమంది నిట్టూరుస్తూ శుభ్రం చేసుకుంటారు… ‘మరియా ఎ అరిస్టిడౌ’ అనే కేక్ డిజైనర్ మాత్రం ‘మరక మంచిదే’ అని ప్రమాదవశాత్తూ కాఫీ ఒలికిపోతే చిరాకు పడలేదు – నేలపై పడ్డ కాఫీ మరకల్లో తన దష్టితో ‘డిజైన్’ చూసింది. కాఫీ లో కుంచె అద్ది అద్భుతమైన డిజైన్స్ వేయడం మొదలు పెట్టింది. మొదట్లో అనుకోకుండా చేసినా తర్వాతర్వాత కాఫీ డిజైన్ల మీద ఏకాగ్రతతో పట్టు సాధించి ఎవరూ వేయని, వేయలేని విధంగా చిత్రాలను మలిచింది. దాంతో ఆమెకి ఓ ప్రత్యేక గుర్తింపూ లభించింది. యూరప్ కి చెందిన ‘మరియా’ చిత్రాలకు ఇప్పుడు భలే గిరాకీ. కొన్ని కొన్ని ప్రమాదవశాత్తూ జరిగినా ‘అంతా మనమంచికే’ అనుకుంటే ఫలితం అమోఘంగా ఉంటుంది. కాఫీ ఒలకడంతో తనదైన సజనతో కొత్త తరహా కళకి ప్రాణం పోసింది. ఆడాళ్లూ మీకు జోహార్లు… ఓపిక.. ఒద్దిక.. మీ పేర్లు. మీరు ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళు అని ప్రపంచం అనుకునేలా మంచి గుర్తింపు తెచ్చేసుకుంది.
– ఆనంద ‘మైత్రేయ’మ్
హైదరాబాద్