శీతల దేవుని గద్ద కూల్చిన అడవి శాఖ సిబ్బంది

నవ తెలంగాణ- రామారెడ్డి
– బీట్ ఆఫీసర్ కంట్లో కారం కొట్టిన గిరిజనులు
అడవిలో శీతల దేవుని గద్దెను నిర్మించారని, గద్దెనిర్మానాన్ని కూల్చేసిన అడవి అధికారులను అడ్డుకొని ఆందోళనకు దిగిన గిరిజనులు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని గోకుల్ తాండ గ్రామపంచాయతీ పరిధిలో గత మూడు సంవత్సరాల నుండి ఊరుకు ఆనుకొని, అడవి భూమిలో ఓ చెట్టు కింద శీతల దేవుని నిర్మించారు. ఈనెల ఒకటో తేదీన నుండి నాలుగు రోజులు ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందించి గద్దెను నిర్మించామని గిరిజనులు ఆరోపించారు. అనంతరం పండగ కూడా చేసినట్లు గిరిజనులు ఆరోపించారు. శనివారం సాయంత్రం గద్దెను గునుపాలతో అడవి శాఖ సిబ్బంది కూల్చివేయడంతో, గిరిజనులు ఆగ్రహించి బీట్ ఆఫీసర్ శ్రీధర్ పై కారం తో దాడి చేశారు. కొంతసేపు ఉద్రేకత్త నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింప చేశారు. సెక్షన్ ఆఫీసర్ జయను వివరణ కోరగా గత రెండు రోజుల నుండి సమావేశాలు, కోర్టు  పనుల పై వెళ్ళటంతో, గిరిజనులు అక్రమంగా గద్దే నిర్మించారని, కట్టెలను తొలగించి, సిబ్బంది గుణపంతో కూల్చారని, గిరిజనులు దాడి చేయడంతో, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు.