ఎంపీడీఓ కార్యాలయంలో రక్త నమూనాల సేకరణ 

Collection of blood samples at MPDO office

నవతెలంగాణ – భైంసా
ప్రస్తుతం స్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో భైంసా ఎంపీడీఓ కార్యాలయంలో ఆరోగ్య సిబ్బంది పారిశుద్ధ కార్మికులకు, ఉద్యోగులకు, ఉపాధి హామీ సిబ్బంది రక్త నమూనాలను సేకరించారు. రక్త పరీక్షలు చేసి అవసరమైన వారికి వైద్య చికిత్సలు అందించనున్నట్లు వైద్యులు డాక్టర్ ప్రశాంత్ తెలియజేశారు. రక్త నమూనా సేకరణలో హెల్త్ ఆఫీసర్ సలీం, ఏఎన్ఎంలు పూల, ప్రేమలత, ల్యాబ్ టెక్నీషియన్ బాలాజీ తదితరులున్నారు.