రేషన్ కార్డు లేని రైతుల వివరాలు సేకరణ

నవతెలంగాణ-నిజాంసాగర్ 
రేషన్ కార్డులు లేని కారణంగా రుణమాఫీ కానీ రైతుల కుటుంబ సభ్యుల నిర్దారణ చేసి రుణమాఫీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో గురువారం మండలంలోని మాగి గ్రామంలో రేషన్ కార్డులు లేని రైతుల ఇళ్ళకు వెళ్ళి వారి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించినట్టు మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్ తెలిపారు. అనంతరం సేకరించిన వివరాలను  ఆన్లైన్లో నమోదు చేయడం జరిగింది అని ఆయన అన్నారు.  కార్యక్రమంలో  వ్యవసాయ విస్తరణ అధికారి సాగర్ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.