ఇందల్ వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని తిర్మన్ పల్లి గ్రామంలో హైదరాబాద్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి మోకన్పల్లి సందీప్ గ్రామంలో హైపర్ టెన్షన్స్ తో బాధపడుతున్న ప్రజలపై పరిశోధన నిమిత్తం గ్రామంలో గల హైపర్ టెన్షన్ రోగుల నుండి వివరాలను సేకరించినట్లు మండల అరోగ్య విస్తరణ అధికారి వై శంకర్ తెలిపారు.హైపర్ టెన్షన్ రోగులు, మానసిక, సామాజిక,ప్రవర్తన వివరాలు, వాడుతున్న మందుల వివరాలు, వారి జీవన విధానం,ఆర్థిక పరిస్థితి, వారు కుటుంబానికి ప్రధాన వ్యక్తి అవునా? కాదా? వివాహ స్థితి, ప్రైవేటుగా మందులు వాడుతున్నట్లయితే ఎంత ఖర్చవుతుందని, విద్యార్హత, గ్రామీణ ప్రాంతం లేదా పట్టణ ప్రాంతం, వారి నివాస స్థితి గతులు,మందులు తీసుకోవడం ద్వారా వారి ఆరోగ్య పరిస్థితి, మందులు ఆపేస్తే దానికి గల కారణాలు, శ్వాస తీసుకోవడంలో ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా, కష్టపడి పని చేసిన తర్వాత లేదా, ఒత్తిడితో కూడిన పరిస్థితి తర్వాత, క్రమంగా విశ్రాంతి తీసు కోవాలని అనిపిస్తుందా, పనిచేయడానికి ఇబ్బందిగా అనిపిస్తుందా, భయాందోళనకు గురవుతున్నారా, ఇలాంటి విషయాలపై సర్వే చేసి చేసి పరిశోధక పత్రాన్ని విశ్వవిద్యాలయానికి సమర్పించడానికి గ్రామానికి వచ్చానని పరిశోధక విద్యార్థి సందీప్ తెలియజేశారు. కుటుంబంతో సరదాగా గడుపుతున్నారా ? స్నేహితులతో మీ సంతోషాన్ని మరి దుఃఖాన్ని పంచుకుంటున్నారా, కుటుంబానికి మీకు సరైన సహాయము అందుతుందా, మీరు వ్యాయామం చేస్తున్నారా,అనగా ఉదయం చురుకైన నడక,సైక్లింగ్ లాంటి వ్యాయమాలు చేస్తున్నారా, మీరు ఆల్కహాల్ సేవిస్తారా, గ్రీన్ సలాడులు అనగా కూరగాయతో చేసిన ద్రవాలు, పండ్లు, జ్యూసులు తృణధాన్యాలు, ఫైబర్, ఆహారము వారానికి ఒకసారి లేదా వారానికి రెండు లేదా మూడుసార్లు తీసుకుంటున్నారా లాంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూపర్వైజర్ ఊహ శ్రీ, ఆరోగ్య పర్యవేక్షకులు అక్బర్ అలీ, ఆరోగ్య కార్యకర్తలు శారద, భానుప్రియ ఆశా కార్యకర్త బండ ప్రమీల పాల్గొన్నారు.