వయనాడ్ వరద బాధితులకు అండగా విరాళాల సేకరణ..

Collection of donations for Wayanad flood victims– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
కేరళ రాష్ట్రం వయనాడ్ ప్రాంతంలోని వరద బాధితుల అండగా ఉందామని , అన్ని విధాలుగా సహకారం అందించి ఆదుకుందామని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ పిలుపునిచ్చారు. వరద బాధితుల సహాయార్థం సీపీఐ(ఎం) భువనగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం భువనగిరి పట్టణంలోని మండలానికి సంబంధించిన వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా  నర్సింహ్మ పాల్గొని మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యంతో కొండ చర్యలు విరిగిపడి వాగులు వంకలతో కేరళ రాష్ట్రంలోని వయనాడ్ ప్రాంతంలో వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, వేలాదిమంది గాయాలపాలై క్షతగాత్రులుగా సర్వం కోల్పోయి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వారందరినీ మానవత దృక్పథంతో ఆదుకోవడానికి ప్రజలు రాజకీయాలకతీతంగా ముందుకు వచ్చి అన్ని విధాల సహకారం అందించాలని కోరారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేకమంది మేధావులు సినీ కళాకారులు అభ్యుదయవాదులు తమ వంతు సహకారం అందిస్తున్నారని వారందరికీ సీపీఐ(ఎం) తరపున ధన్యవాదాలు తెలిపారు. వివిధ ప్రభుత్వ ఆఫీసులలో సహాకారం అందించిన ఉద్యోగస్తులకు అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) భువనగిరి మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ్మ , పిఎన్ఎం జిల్లా కార్యదర్శి ఈర్లపళ్లి ముత్యాలు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఏదునూరి మల్లేశం, కొండా అశోక్, మండల కమిటీ సభ్యులు సిలువేరు ఎల్లయ్య , చీమలకొండూరు శాఖ కార్యదర్శి బోడ ఆంజనేయులు పాల్గొన్నారు.