వయనాడ్ వరద బాధితులకు విరాళాల సేకరణ 

Collection of donations for Wayanad flood victimsనవతెలంగాణ – హలియా
కేరళలోని వయనాడు వరద బాధితులకు మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరు స్పందించి ఆదుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అవుతా సైదులు అన్నారు. హాలియాలో సిఐటియు ఆధ్వర్యంలో వ్యక్తుల వద్ద షాపుల వద్ద వీధి కలెక్షన్ రూ.3727 రూపాయలు సేకరించి జిల్లా కమిటీకి పంపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాల్సింది పోయి ప్రకృతి వైపరీత్యాలను కూడా రాజకీయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. తక్షణమే యుద్ధ ప్రాతిపదికన కేరళ ప్రభుత్వాన్ని ఆదుకోవాలని దీనికి ప్రజలు ప్రజాస్వామిక వాదులు పెద్ద ఎత్తున అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు నల్లబెల్లి జగదీష్ గొర్రె రమేష్ సిఐటియు నాయకులు పొదిల వెంకన్న లక్ష్మమ్మ వెంకటమ్మ నారమ్మ సాయి హర్షిత్ శివ తదితరులు పాల్గొన్నారు.