కేరళ రాష్ట్రంలోని వయనాడు వరద బాధితుల సహాయార్థం సీపీఐ(ఎం) మండలం కమిటీ ఆధ్వర్యంలో బుధవారం గట్టుప్పల మండల కేంద్రంలో విరాళాలు సేకరించారు. మండలంలోని దుకాణదారులు పౌరుల వద్ద నుండి విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చాపల మారయ్య, కర్నాటి మల్లేశం, సిపిఎం చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్, గట్టుప్పల మండల నాయకులు పెద్దగాని నరసింహ, కర్నాటి యాదగిరి, బుచ్చిరెడ్డితదితరులు పాల్గొన్నారు.