ఐఏబీ లబ్ధిదారుల సేకరణ పూర్తి..

Collection of IAB beneficiaries is complete..– మండలంలో 2183 మందిగా నమోదు…
-ఎంజీ ఎన్ఆర్ ఈజీఎస్ ఏపీవో రామచంద్రరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల సేకరణ,అప్డేషన్ పూర్తి అయిందని,మండల వ్యాప్తంగా 2183 మందిని గుర్తించామని మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పధకం ఏపీవో కే.రామచంద్రరావు శనివారం నవతెలంగాణ కు తెలిపారు. ఈ పధకంలో మండలంలో 7,876 జాబ్ కార్డ్ లు ప్రస్తుతం ఫోర్స్ లో ఉన్నాయని,పధకం నిబంధనలు ప్రకారం 2023 – 2024 ఆర్ధిక సంవత్సరంలో 20 రోజులు పాటు పనిచేసి,భూమిలేని నిరుపేదలు 2,183 మంది ఉన్నారని తెలిపారు.వీరి ఆధార్ కార్డు,బ్యాంక్ ఖాతా,ఉపయోగంలో ఉన్న మొబైల్ ఫోన్ నెంబర్ ఆన్లైన్ ప్రక్రియ పూర్తి అయిందని వివరించారు.