భారత విద్యార్థి ఫెడరేషన్ నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గిరిరాజ్ కళాశాలలో విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని సంతకాల సేకరణ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జి జి కళాశాల యూనిట్ సెక్రటరీ చక్రి మాట్లాడుతూ.. గతంలో జి జి కళాశాలకు బస్సు సౌకర్యం ఉండేదని సంవత్సర కాలం నుండి జి జి కళాశాలకు బస్సులను పునరుద్ధరణ చేయలేదని బస్టాండ్ నుండి జి జి కళాశాల వరకు రవాణా సౌకర్యాన్ని వెంటనే కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాజకీయ నాయకులు జి జి కాలేజ్ ని అనేక మీటింగ్లకు వాడుకున్న జీజీ కాలేజీ పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. జిజీ కళాశాల టైమింగ్స్ అనుగుణంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వరకు బస్సులను నడపాలని, బస్సులు నడపకపోవడం వల్ల విద్యార్థులు అధిక ఆటో చార్జీల రీత్యా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జి జి కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని జి.జి కళాశాలను కాంగ్రెస్ ప్రభుత్వం 100 కోట్లతో అభివృద్ధి చేయాలని మరియు సకాలంలో స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు దినేష్, సుజిత్, తదితర నాయకులు పాల్గొన్నారు.