
– సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రధాని మోదీకి లేక
– సీఐటీయూ మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు
నవతెలంగాణ – నెల్లికుదురు
సీఐటీయూ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సీఐటీయూ మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు తెలిపారు. మండల కేంద్రంలోని మహిళకు రక్షణ ప్రభుత్వం కల్పించాలని సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో మహిళలపై పిల్లలపై రోజురోజుకు పెరుగుతున్న క్రూరమైన హింస సమాజంలో, పని ప్రదేశాలలో మహిళలపై కొనసాగుతున్న వివక్షను చూసి భారతదేశంలోని పురుషులు మహిళలతో సహా యావత్ కార్మిక వర్గం భయపడుతున్నారు. మహిళలపై అన్ని రకాల వివక్ష హింసను అంతం చేయడానికి మరియు పని ప్రదేశాలలో మహిళలకు భద్రత కల్పించడానికి రక్షణ చర్యలు తీసుకోవాలని సీఐటీయూ తరఫున డిమాండ్ చేస్తున్నాము అన్ని రంగాలలో సమాన వేతనాలు అమలు చేయాలని మహిళలకు ఉమ్మడి చట్టాలు అమలు చేయాలని అన్ని కార్యాలయాలలో మహిళలకు భద్రత కల్పించాలని, వైద్యులు నర్సులు పారామెడికల్ సిబ్బంది ఆశా వర్కర్లు, సహా ఆరోగ్య సిబ్బందికి భద్రతను ప్రత్యేక రక్షణ చట్టం చేయాలి అని అన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మహిళలపై ఇస్తున్న అరికట్టడానికి అవసరమైన చట్టపరమైన పరిపాలనపరమైన చర్యలు తీసుకోవాలని, లైంగిక ఇన్సా కేసులో దోషులను వారి రాజకీయ అనుబంధాలతో సంబంధం లేకుండా బలమైన రాజకీయ వైఖరిని తీసుకుంటారని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సురేష్ శ్రీను బిక్షపతి ఎల్లయ్య విజయ రేణుక ఉప్పలయ్య ఐలేష్ తదితరులు పాల్గొన్నారు.