నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
పెద్దకొడప్ గల్ మండలంలోని పలు గ్రామాలలో భారత జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేరామిట్టి మేరాదేశ్ కార్యక్రమంలోభాగంగాగ్రామంలోమట్టిని స్వీకరించారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బాలాజీ పటేల్ మాట్లాడుతూస్వాతంత్రంకోసంపోరాటంచేసిమహనీయుల్లో స్మరణ కోసం దేశరాజ్యదాన్ని ఢిల్లీలో నిర్మిస్తున్న స్మృతి వనం కోసం దేశవ్యాప్తంగా ఉన్న గ్రామాల నుంచి మట్టి సేకరించడం జరిగిందని తెలిపారు.ఇందులో భాగంగా శుక్రవారం నాడు మండలంలోని బేగంపూర్, బేగంపూర్ తాండ,కాస్లాబాద్, పెద్ద దేవిసింగ్ తండాలలో గల ఆర్మీ జవాన్ ఇంటి నుండి మట్టిని సేకరిస్తున్న బిజెపి నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బాలాజీ పటేల్, సంజు పటేల్,అశోక్ పటేల్, నాందేవ్, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.