కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వ్యవ సాయం తర్వాత తునికాకు సేకరణ రెండోపంటగా ముఖ్యమైన ఆదాయవనరుగా ఉంది. జిల్లాలోని ఆసి ఫాబాద్, కాగజ్‌నగర్ రెండు ఫారెస్ట్ డివిజన్‌లు. ఆసి ఫాబాద్‌లో 12, కాగజ్‌నగర్‌లో 13, మొత్తం 25 యూనిట్లు, 250కి పైగా కల్లాలుండేవి. దాదాపు 30 వేల మంది కూలీలు ప్రతి సీజన్‌లో ఆకుసేకరణలో భాగస్వాములవుతారు. వీరితో పాటు గోడౌన్ కార్మి కులు, ట్రాన్స్‌పోర్ట్, కల్లేదార్లు, ఉపాధి పొందుతారు. కాంట్రాక్టర్లకు లక్షల రూపాయల ఆదాయం లభి స్తుంది. ప్రభుత్వానికి సైతం ఎటువంటి పెట్టుబడి (ఖర్చు) లేకుండా ఆదాయం వస్తుంది. ఆకుసేకరణ పై ఆధారపడి బీడీ పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమపై వేల కార్మికులు ఉపాధి పొందుతారు. ఆకు విదేశా లకు ఎగుమతై విదేశీ మారకం కూడా వస్తుంది. దీని ద్వారా ఈ ఒక్క సీజన్‌లోనే దాదాపు 25 వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది.
ఇదంతా ఒక ఎత్తయితే కేంద్రంలోని బీజేపీ ప్ర భుత్వం కార్మికుల ఉపాధికొట్టే ప్రయత్నాలు శరవే గంగా అమలు చేస్తున్నది. అటవీ ప్రయివేటీకరణ నిబంధనలకు తలొగ్గి పెద్దపులులు సంచరిస్తున్నా యనే పేరుతో ఈ ఏడాది సీజన్‌లో తునికాకు సేక రణ నిలిపివేయాలని, ఫారెస్ట్ ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి నివేదిక పంపినట్టుగా వార్తలొచ్చాయి. అధికారులతో మాట్లాడి కాస్తా కూపీలాగితే ఇది వాస్త వమేనని తెలిసింది. 2006-అటవీ హక్కుల చట్టం ప్రకారం తునికాకు సేకరణ చిన్న తరహా అటవీ ఉత్ప త్తుల కిందకు వస్తుంది. తునికాకును సేకరించడం వారి హక్కు. పులులను రక్షించాల్సిన బాధ్యత కూడా అటవీశాఖపై ఉంది. కానీ ఈ పులుల సాకుతో ఆకు సేకరణ నిలిపేయడం ఎంతమాత్రం సరికాదు. ఆసి ఫాబాద్ డివిజన్‌లో కవ్వాల్ టైగర్‌జోన్, మైనింగ్ పేరుతో ప్రతి ఏడాది యూనిట్లు తగ్గిస్తూ వచ్చారు అటవీశాఖ అధికారులు. గతేడాది కేవలం 2 యుని ట్లకే టెండర్లు పిలిచారు. కాగజ్‌నగర్ డివిజన్‌లో కడంబ టైగర్‌జోన్ పేరుతో గతేడాది 13 యూనిట్ల కుగాను 9 యూనిట్లు టెండర్లు పిలిచారు. ఈ విధం గా ప్రతి ఏడాది యూనిట్లు, కల్లాలు తగ్గుతూ వచ్చా యి. ఈ ఏడాది 2024 సీజన్‌కి గాను మొత్తం ఆకు సేకరణ నిలిపేయాలనే ఆలోచన చేయడం ఆది వాసులు, దీనిపై ఆధారపడి జీవించే పేదకూలీల కడుపు కొట్టడమే.
‘తునికాకు సేకరణ లేనట్టే’ అని వార్తా పత్రికల్లో రాగానే తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం (టీఏజీ ఎస్) స్పందించింది. జిల్లా కలెక్టర్‌కు టెండర్లు పిల వాలని వినతిపత్రం అందజేసింది. దీనికి స్పందిం చిన కలెక్టర్ ఫారెస్ట్ చీఫ్ కన్వీనర్‌కి లేఖ రాశారు. తర్వాత, తునికాకు కల్లేదార్‌లు సమావేశం నిర్వహిం చి, జిల్లాలోని ఎమ్మెల్యేలకు వినతి పత్రాలిచ్చే కార్యక్ర మాలను అమలుచేశారు. దశలవారిగా పోరాటాలూ నిర్వహించారు. జనవరి 29న ఆసిఫాబాద్ జిల్లాలోని అటవీశాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి డిఎఫ్‌ఓకి మెమోరాండం అందజేశారు. టీఏజీఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి సైతం వినతిపత్రం అందజేయడంతో పోరాటానికి దిగొచ్చిన ప్రభుత్వం, అటవీశాఖ జిల్లాలోని 15 యూనిట్లు,179 కల్లాలకు టెండర్లు ఆహ్వానించింది. ఇంకా యూనిట్లు అధికారులు పరిశీలించి, టెండర్ల అనంతరం ఎన్ని యూనిట్లు ఓకే చేస్తే ఆ గ్రామాల పరిధిలో కూలీలకు ఉపాధి దొరుకుతుంది.ఇది టీఏజీఎస్ కూలీల తరపున పోరాడి సాధించిన విజయం. తునికాకు సేకరణకు ఏర్పాటు చేసిన యూనిట్ల ద్వారా వచ్చిన డబ్బులు మళ్లీ మార్కెట్‌లోకి వస్తే వ్యాపారాలు పెరుగుతాయన్న విషయం తెలియనిది కాదు.
ఇదే సందర్భంలో 2016 నుండి తునికాకు బోనస్ పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అనేక పోరాటాల ఫలితంగా ఎన్నికల ముందు గత ప్రభు త్వం హడావిడిగా కొన్ని చెక్కులు పంపిణీ చేసింది. జిల్లాలో దాదాపు 45 వేల మంది కూలీలకు బోనస్ రావాల్సి ఉండగా ఇంకా 8,300 మందికి పెండింగ్ లో ఉంది. పెండింగ్ బోనస్ కూడా పోరాడితేనే వ స్తుందన్న విషయం గమనంలో ఉంచు కోవాలి. కల్లాలు ఎలాగైతే పోరాడి సాధించు కున్నారో, బోనస్ సాధించడం కోసం కూడా కూలీలు ఏకమై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
– కోట శ్రీనివాస్, 970339151