కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘బెదురులంక 2012’. లౌక్య ఎంటర్టై న్మెంట్స్ బ్యానర్ మీద రవీంద్ర (బెన్నీ) బెనర్జీ ముప్పనేని నిర్మించిన ఈ సినిమాకు క్లాక్స్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గత వారం విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ బుధవారం నిర్వహించిన విజయోత్సవ సభకు హీరో శ్రీ విష్ణు, దర్శకుడు అజరు భూపతి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. హీరో కార్తికేయ మాట్లాడుతూ, ‘కలెక్షన్లు డే బై డే పెరుగుతూనే ఉన్నాయి. మేం నమ్మి తీసుకున్న నిర్ణయాన్ని ప్రేక్షకులు సమర్థించడం, సపోర్ట్ చేయడం అనేది నాకు పెద్ద సక్సెస్ అనిపిస్తుంది. గత నాలుగైదేళ్లుగా ఎన్నో రకాల పాత్రలు చేస్తున్నాను. ఇప్పుడు ఇన్నాళ్లకు నేను నమ్మింది జరిగింది. నాకు పెద్ద రిలీఫ్ అనిపించింది’ అని తెలిపారు.’కార్తీకేయ ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాత్రలు చేస్తూనే ఉన్నాడు. తనకి పెద్ద హిట్ పడాలని అనుకున్నాను. ఇప్పుడు ఈ సినిమాతో హిట్ కొట్టేశాడు’ అని హీరో శ్రీ విష్ణు అన్నారు. దర్శకుడు అజరు భూపతి మాట్లాడుతూ, ‘కార్తికేయకు హిట్ వస్తే నాకు కూడా హిట్ వచ్చినట్టే. క్లాక్స్కు ఇంత మంచి హిట్ రావడం ఆనందంగా ఉంది’ అని చెప్పారు. ”నాకు రెండో హిట్ వచ్చినందుకు ఎంతో హ్యాపీగా ఉంది. ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అని నాయిక నేహా శెట్టి అన్నారు.