కలెక్షన్లు.. థియేటర్లు పెరిగారు

Collections.. Theaters have increasedరాజ్‌ తరుణ్‌ హీరోగా, ఎఎస్‌ రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తిరగబడరసామీ’. సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియా బ్యానర్‌ పై మల్కాపురం శివకుమార్‌ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి సూపర్బ్‌ రెస్పాన్స్‌తో విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో టీం సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది. డైరెక్టర్‌ ఎ ఎస్‌ రవికుమార్‌ చౌదరి మాట్లాడుతూ,’తెలుగు ప్రేక్షకులకు హ్యాట్సాప్‌. నిన్నటి కంటే ఈ రోజు కలెక్షన్స్‌, థియేటర్స్‌ పెరిగాయి. మంచి సినిమాని ఏదీ అడ్డుకోలేదని నిరూపించారు ఆడియెన్స్‌’ అని అన్నారు. ‘మా సినిమా సక్సెస్‌ మీట్‌ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. సినిమా 200 థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రోజు మరో 28 థియేటర్స్‌ పెరిగాయి. సినిమా పై మంచి రిపోర్ట్‌, రిజల్ట్‌ ఉంది. సినిమాని సపోర్ట్‌ చేసున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’ అని నిర్మాత మల్కాపురం శివకుమార్‌ చెప్పారు.