ఒంటరిగా నిలిచి ఎప్పుడూ ఏ విజయాన్ని కాంక్షించలేము. సమూహమే బలమైన గొంతుకను ఇస్తుంది. మన చుట్టూ ఎన్నో వేల గొంతుకుల మధ్య ఏ సమూహాలు ఉన్నాయో ఎటువంటి సఅజన చేస్తున్నాయో నిరంతరం అప్రమత్తులమై ఉండాలి. ఎన్నో విరుద్ధ గొంతుకుల మధ్య ఓ దారి చేసుకుని నిజమైన ప్రజల గొంతుకను వినిపించడానికి ప్రజల చైతన్య ధారను తిరిగి ఉత్తేజపరిచేలా భావజాల రంగంలో ప్రజాస్వామిక దఅక్పథాన్ని పెంచడానికి నిరంతరం కఅషి చేసే మహత్కార్యాన్ని ‘సమూహ’ సెక్యులర్ రైటర్ ఫోరమ్ తీసుకున్నది. నియంతఅత్వానికీ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యవేత్తలు రాజకీయ ఆలోచనాపరులు నిత్యం జరుగుతున్న అన్యాయాల పై నిరసన తెలుపుతూనే ఉంటారు, ఓ దఅక్పథాన్ని వెల్లడి చేస్తూనే ఉంటారు అనడానికి ‘సమూహ’ సరైన ఉదాహరణ.
లౌకిక ప్రజాస్వామిక జీవ సంస్కఅతి విలువలు పెంపొందించాల్సిన సాహిత్యం పై యువతరం ఆలోచనల తీరును వారి దఅక్కోణాలను శైలిని సానబెట్టి పదును తీర్చడానికి భిన్న సాహిత్య అస్తిత్వాలకు చెందిన రచయితలు ఉమ్మడి కార్యాచరణతో పరిశీలనాత్మక నిర్దేశకాలను అందించడానికి పోయిన సంవత్సరం సమూహ రూపంలో ఐక్యవేదిక ఏర్పరచి రాజ్యాంగ బద్ధంగా లౌకిక స్ఫూర్తిని పెంచడానికి ముందుకు వచ్చారు. దేశంలో మాట్లాడే శక్తిని , మాట్లాడే మనుషుల్ని వెతికి మరీ జైళ్ళ పాలు చేస్తుందీ మతస్వామ్య ప్రభుత్వం. ప్రజా సంక్షేమం మరచి కార్పొరేట్ ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నది.
ప్రజాస్వామ్య దేశంలో ప్రజలపై జరుగుతున్న అన్యాయాలని ప్రశ్నించే గొంతుకలు లేకుండా చేయాలనుకుంటున్నాయి. ఈ ఫాసిస్టు భావజాలానికి కూకటి వేళ్ళతో ముగింపు పలకలేని నిస్సహాయతలను సృష్టిస్తోంది.
దేశంలోనే అనేక చోట్ల సీఆర్పీ సెక్షన్ 144 నుంచి ఉపా వరకు పెక్కు నిర్బంధ చట్టాలను హింసాత్మకంగా ఉపయోగిస్తున్నారు.
కనీసం రైతులు చేసే శాంతియుత కార్యక్రమాలపై కూడా నిర్బంధం అమలు చేస్తున్నారు. దూకుడుగా అణిచివేతలకు పాల్పడుతున్న పాలకవర్గం గాంధేయ మార్గంలో తెలిపే నిరసనలను సైతం గౌరవించే చోటు నేడు మన దేశంలో ఎక్కడా లేకుండా పోతుంది. కనీసం అంబేద్కర్ జయంతి ఇలాంటి కార్యక్రమాలను అంబేద్కర్ విగ్రహం వద్ద పుస్తకాల ఆవిష్కరణను కూడా అడ్డుకుంటుంది. సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం వరంగల్ లో జరిపిన సభపై మతవాద శక్తులు చేసిన దాడులు మన కళ్ళ ఎదురుగా జరిగిన ఒక ప్రత్యక్ష సాక్ష్యం. ఒక విద్యాత్మక చర్చావేదికని ఎలా నిర్వహిస్తారు అనే ప్రశ్నలతో చల్లాచెదురు చేయాలని చూసింది., కేసులు వేసింది. శాంతియుత బౌద్ధిక చర్చలే అయినా అవి ప్రజల ఆలోచనలపై ప్రభావాన్ని చూపిస్తాయేమో అన్న భయంతో ఈ పాలకుల వెన్ను జలదరించింది.
ప్రత్యామ్నాయ ఆలోచనల కేంద్రాలు కావలసిన విశ్వవిద్యాలయాల్లో ఈనాటి మత రాజకీయాలు అదఅశ్య శక్తులు చాప కింద నీరులా మనుధర్మాలని చొప్పిస్తూ ఇదే మన సంస్కఅతి ఇదే మన జీవన విధానం అంటూ ప్రచారం చేస్తోంది.
ప్రజా స్వామిక విలువలపై చట్టసభల్లో బయటా మెరుపు దాడులకు దిగుతుంది. వాక్ స్వాతంత్రాన్ని లేకుండా దిగమింగుతున్న సందర్భంలో ప్రశ్నించే గొంతుకగా నిలబడే సమయాన్ని నిర్ణయించుకుని అంతరంగాల ఆవిష్కరణలను సామూహిక గొంతును వినిపించడానికి మరోసారి సమూహ సిద్ధమైంది.
ఇది మన సమూహ రచయితలు అందరూ కలిసి నిర్మించుకోవాలనుకుంటున్న లౌకిక ప్రజాస్వామ్య విలువలు ప్రజల్లోకి తీసుకొని వెళ్లే ఓ అవగాహన సదస్సు మాత్రమే ఇది.. ఇలా ఓ సదస్సుని జరుపుకోవడానికి రచయితలు అందరూ కూడా ఈనెల 14వ తారీకున మహబూబ్ నగర్లో తొలి రాష్ట్ర మహాసభలని నిర్వహించుకుంటున్నారు.ఈ సభలో రచయితలు అందరు పాలు పంచుకోవాలని కోరుతున్నాను.
– కె. రూప రుక్మిణి