పారిశ్యుద్యం పక్కాగా జరగాలి: అదనవు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక

– ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టండి
– సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో పారిశ్యుద్య పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అదనపు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక  అన్నారు. సోమవారం  కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఏ. వెంకట రెడ్డితో కలసి పాల్గొని, ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో పారిశ్యుద్య పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారుచేసి వేసవిలో త్రాగునీటి కొరత రాకుండా చూడాలని, అలాగే హరిత హారంలో నాటిన మొక్కలకు నీటి వసతి కల్పించాలని సూచించారు. గ్రామాల్లో జ్వరాలు, ఇతర వ్యాధులు ప్రభలకుండ వైద్యాధికారులు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు.  ప్రజావాణిలో వివిధ భూ సమస్యలకు సంబంధించి 17 దరఖాస్తులు వచ్చాయని అలాగే ఇతర శాఖల కు సంబంధించి 26  దరఖాస్తులు మొత్తం 43 దరఖాస్తులు అందాయని పేర్కొన్నారు. ప్రజావాణిలో ప్రజలు అందించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  ఎ.డి.ఎ రామారావు నాయక్, డి.ఈ.ఒ అశోక్, బి డబ్ల్యు ఓ జ్యోతి పద్మ, డి.టి.డి.ఒ శంకర్ వివిధ శాఖల అధికారులు, దరఖాస్తు దారులు తదితరులు పాల్గొన్నారు.