నవతెలంగాణ – రామగిరి
రామగిరి మండలంలోని లద్నాపూర్ గ్రామ లోని మదునం పోచమ్మ, పెద్ద పోచమ్మ గుల్ల వద్ద సింగరేణి సంస్థ వచ్చే భక్తులకు అసౌకర్యం ఇబ్బందులు కలిగేలా గుడి చుట్టూ ఇనుపకంచలు లోతైన కందకాలు భారీ వాహనాలు నడిచే రహదారులు నిర్మించి గుడికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్నారని సోమవారం గ్రామ ప్రజలు పెద్దపల్లి కలెక్టర్ ముజామిల్ ఖాన్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ భక్తుల ప్రశాంతతను దెబ్బతీసే విధంగా కొన్ని సమయాల్లో భక్తులను గుడి వద్దకు పోనీయకుండా అడ్డుకుంటున్నారని అదేవిధంగా గత మూడు నెలల క్రితం గ్రామానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాత్రి గుడిలోని అమ్మవార్ల విగ్రహాలను తొలగించారని విషయం తెలుసుకున్న గ్రామస్తులు యధా స్థానంలో విగ్రహాలను ఉంచాలని ధర్నా చేయడంతో తిరిగి పున ప్రతిష్ట చేశారని తదనంతరం గుడి పరిసరాలలో భక్తులు నిలబడడానికి కూడా చోటు లేకుండా ఇబ్బందులు కలగజేస్తున్నారని సింగరేణి సంస్థ ఆకృతాలకు అడ్డుకట్ట వేసి వచ్చే నెలలో జరిగే బోనాల జాతరకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సింగరేణి కంపెనీ సహకరించాలని కలెక్టర్ కోరారు కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తొగరి లింగయ్య, నరివెద్ది శ్రీనివాస్, తాటి శ్రీనివాస్, పొన్నం సత్యనారాయణ, తాళ్లపల్లి చంద్రయ్య, చిప్ప అనిల్, మేడగోని రామచందర్, ఎస్ కె జమీల్, కె సమ్మక్క, చిలువేరి ఓదెలు, తాటికొండ సునీల్, నాంపల్లి రాయమల్లు, కె సారక్క తదితరులు ఉన్నారు.