
చిన్న వయసులో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు సాధించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ అన్నారు. నిజామాబాద్ నగరానికి చెందిన నారాయణ పాఠశాల విద్యార్థిని శ్రీనిధిని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, డీఈవో దుర్గాప్రసాద్ అభినందించారు. ఈ మేరకు శనివారం జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ లు విద్యార్థిని శ్రీనిధి ని అభినందించి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు ను వారి చేతుల మీదుగా అందజేశారు. సుభాష్ నగర్ లోని నారాయణ పాఠశాలకు చెందిన శ్రీనిధి పిపి-1 విద్యార్థిని, పిన్న వయసులోనే 28 భారతీయ రాష్ట్రాల రాజధానులు, 9 జాతీయ చిహ్నాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, గాయత్రి మంత్రం, గణితంలో రెండో ఎక్కాలను చదవడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సాధించింది. చిన్న వయసులో ఇలాంటి రికార్డ్స్ సాధించినందుకు విద్యార్థిని శ్రీ నిధి మేధాశక్తిని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, డీఈఓ దుర్గ ప్రసాద్ అభినందించారు. మునుముందు ఇలాంటి రికార్డులు సొంతం చేసుకోవాలని వారు సూచించారు.ఈ కార్యక్రమంలో నారాయణ పాఠశాలల తెలంగాణ జి ఎం గోపాల్ రెడ్డి, ఏజీఎం శివాజీ పాటిల్, ప్రిన్సిపల్ జోష్ణ, విద్యార్థిని తల్లిదండ్రులు వెంకటేష్, సుష్మ రాణి తోపాటు పాఠశాల అధ్యాపక బృందం విద్యార్థిని కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.